Janhvi Kapoor: పిల్లో ఫోబియాతో ఇబ్బంది పడుతున్న జాన్వీ

శ్రీదేవి(sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi Kapoor) కొంత కాలానికే తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని సొంతం చేసుకుంది. జాన్వీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమవుతున్నా తనకు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం పడలేదు. హిందీ సినిమాలు చేస్తూనే మరోవైపు తన దృష్టిని టాలీవుడ్ పై పెట్టిన జాన్వీకి ఓ వింత ఫోబియా ఉందట. అదే పిల్లో ఫోబియా.
ఆ ఫోబియా కారణంగానే జాన్వీ ఎక్కడికెళ్లినా తన వెంట తాను రెగ్యులర్ గా వాడే పిల్లో ను కూడా తీసుకెళ్తూ ఉంటారట. షూటింగ్ కోసం జాన్వీ ఓ చోటు నుంచి మరో చోటుకు వెళ్లే ప్రతీసారీ ఓ సెక్యూరిటీ ఆఫీసర్ ఆమెతో పాటూ దిండును పట్టుకుని కనిపిస్తూ ఉండటం చాలా సార్లే చూశాం. అయితే తనకు ఈ ఫోబియా ఉందని జాన్వీ కూడా చాలా సార్లు చెప్పింది.
ఇక సినిమాల విషయానికొస్తే భారీ పారితోషికం తీసుకునే లిస్ట్ లో ఒకరిగా పేరున్న జాన్వీ ఇప్పటివరకు పెద్ద హిట్ లేకపోయినా ఆఫర్లకు మాత్రం ఏం కొదువ లేదు. టాలీవుడ్ లో రామ్ చరణ్(Ram Charan) తో పెద్ది(Peddi) మూవీని చేస్తున్న జాన్వీ, అల్లు అర్జున్(allu arjun)- అట్లీ(atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఓ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని సమాచారం. కాగా జాన్వీ నటించిన పరమ్ సుందరి(param sundari) ఆగస్ట్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.