జాన్వీ రెమ్యూనరేషన్ అంతా?
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి ఇప్పటివరకు బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. హిట్స్ లేకపోయినా అమ్మడికి మొదటి నుంచి సౌత్ నుంచి మాత్రం బాగానే ఆఫర్లు వెళ్లాయి. చాలా కాలంగా సౌత్ సినిమాలకు నో చెప్పిన జాన్వీ ఫైనల్ గా ఎన్టీఆర్ తో దేవర సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు. అప్పుడే జాన్వీకి టాలీవుడ్ నుంచి మరో ఆఫర్ కూడా వెళ్లింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించనున్న స్పోర్ట్స్ డ్రామా లో జాన్వీ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ జాన్వీ తండ్రి బోనీ కపూర్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని లీక్ చేశాడు.
అయితే దేవర సినిమాకు సుమారు రూ. 2.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జాన్వీ కపూర్, ఇప్పుడు బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తో చేయబోయే సినిమా కోసం తన రెమ్యూనరేషన్ ను మరింత పెంచినట్లు తెలుస్తోంది. చరణ్ సినిమా కోసం జాన్వీ ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేస్తుందట. నిర్మాతలు కూడా అంత మొత్తం ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం. అయితే రెండో సినిమాకే ఇంత డిమాండా అని జాన్వీ ని చూసి చాలా మంది నిర్మాతలు నోరెళ్లబెట్టుకుంటున్నారట.













