ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన జాన్వీ
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. ధడక్ సినిమాతో వెండితెర ఆరంగ్రేటం చేసిన ఈ అమ్మడు రీసెంట్గా గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ అనే దేశ భక్తి నేపథ్యంతో తెరకెక్కిన చిత్రంలో నటించింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ త్వరలో తెలుగు తెరపై కూడా కనిపించనుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ముంబైలోని కాస్ట్ లీ ప్రాంతంగా చెప్పుకొనే జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందట జాన్వీ. ఇది మూడు అంతస్తుల భవనం కాగా, ఈ ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు. గతేడాది డిసెంబర్ 7 జరిగింది. ఈ ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు కాగా.. ఈ ఇంటికి సంబంధించి 78 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీని జాన్వీ కపూర్ చెల్లించినట్లు బాలీవుడ్ కథనాలు చెప్తున్నాయి. ప్రస్తుతం దోస్తానా 2, రూహి అఫ్జానా చిత్రాల్లో నటిస్తుంది జాన్వీ కపూర్.













