ఆ పాత్రలకే తన ప్రాధాన్యమంటున్న జాన్వీ
శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటుంది. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ, ఆ సినిమా రిలీజ్ కు ముందే రామ్ చరణ్ తో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇదిలా ఉంటే జాన్వీ నటించిన ఉలఝ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ తనకు నచ్చిన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో సవాల్ లో కూడిన క్యారెక్టర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, తన జీవితమంతా నటనకే అంకితమని, మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నట్లు స్పష్టం చేసింది.
ఓ వైపు గ్లామర్ తో కూడిన కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ జాన్వీ కెరీర్లో దూసుకెళ్తుంది. తక్కువ టైమ్ లో ఎక్కువ సక్సెస్ ను తీసుకురావడంలో కమర్షియల్ సినిమాలు ఉపయోగపడతాయి కానీ రిస్క్ ఉన్న పాత్రలు చేస్తేనే మన టాలెంట్ బయటపడుతుందని చెప్తోంది జాన్వీ. తన కెరీర్లో ఎక్కువ రిస్క్ చేసిన సినిమాల్లో ఉలఝ ఒకటని చెప్పింది జాన్వీ. మరి ఈ సినిమా అమ్మడికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













