Jana Nayagan: ఒక్క సీన్ రీమేక్ కోసం అంత ఖర్చా?

దళపతి విజయ్(Vijay) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాలిటిక్స్ లో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ ఆఖరిగా ఓ సినిమా చేస్తున్నాడు. హెచ్. వినోత్(H. Vinoth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. జన నాయగన్(Jana Nayagan) అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రేమలు(Premalu) ఫేమ్ మమిత బైజు(Mamitha Baiju) కీలక పాత్రలో నటిస్తోంది.
2026 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా బాలకృష్ణ(Balakrishna) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari)కి రీమేక్ అని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. జన నాయగన్ నిర్మాతలు అందులో భాగంగానే భగవంత్ కేసరి రీమేక్ రైట్స్ ను రూ.4 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం జన నాయగన్ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ కాదని తెలుస్తోంది.
భగవంత్ కేసరిలోని గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సీన్ ను మాత్రమే జన నాయగన్ డైరెక్టర్ రీమేక్ చేయనున్నాడని, మిగిలిన కథ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుందని వార్తలొస్తున్నాయి. అంటే కేవలం ఆ ఒక్క సీన్ ను రీమేక్ చేయడానికి జన నాయగన్ టీమ్ రూ. 4 కోట్లు ఖర్చు పెట్టిందన్నమాట. విజయ్ రాజకీయాల్లోకి రాబోయే ముందు వస్తున్న సినిమాలో అలాంటి ఎమోషనల్ సీన్ ఉంటే రాజకీయంగా కూడా పనికొస్తుందనే కారణంతో అంత ఖర్చు పెట్టి ఆ సీన్ ను రీమేక్ చేస్తున్నారని సమాచారం.