SSMB29: మహేష్ నుంచి ఫోన్ కూడా లాగేసుకున్న జక్కన్న
దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కలయికలో పాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన విషయం ఏది బయటికొచ్చినా క్షణాల్లోనే అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29(SSMB29) షూటింగ్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్టు సమాచారం.
సినిమాకు సంబంధించిన విషయాలు ఎక్కడా లీకవకుండా ఉండటానికి రాజమౌళి టీమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సెట్స్ లోకి ఎవరి ఫోన్ ని అనుమతించకుండా చిత్ర యూనిట్ సభ్యులందరికీ రాజమౌళి కండిషన్ పెట్టాడట. ఆఖరికి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా(Priyanka Chopra)కు కూడా రాజమౌళి ఈ విషయంలో మినహాయింపు ఇవ్వలేదు.
ఈ సినిమాకు వర్క్ చేస్తున్న అందరితో రాజమౌళి నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా సినిమా నుంచి కంటెంట్ ను లీక్ చేస్తే దానికి వారు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే మహేష్ నుంచి పాస్ పోర్టు లాగేసుకున్న జక్కన్న ఇప్పుడు ఫోన్ ను కూడా తీసేసుకున్నాడు. మున్ముందు రాజమౌళి కోసం మహేష్ ఇంకెన్ని వదులుకోవాల్సి వస్తుందో చూడాలి.













