Jailer2: షూటింగ్ మొదలుపెట్టకుండానే జైలర్2 సెన్సేషన్
మామూలుగా ఓ సినిమా నుంచి టీజర్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేయాలంటే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ సగమైనా అవాలి లేదంటే పూర్తైనా అయుండాలి. కానీ అసలు ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే నాలుగు నిమిషాల వీడియోని రిలీజ్ చేయడం జైలర్2(Jailer2)కే కుదిరింది. మొన్నటి ఏడాది రిలీజై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్(Jailer) సినిమా సీక్వెల్ కు రంగం సిద్ధమైంది.
నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్(Anirudh RaviChander) మ్యూజిక్ అందిస్తున్నాడు. రిటైర్డ్ పోలీసాఫీసర్ ముత్తువేల్ పాండియన్ చేయబోయే విధ్వంసాలు ఈసారి నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతున్నాయనే విషయాన్ని అనౌన్స్మెంట్ తోనే అర్థమయ్యేలా చేశారు. నెల్సన్, అనిరుధ్ ఎలక్ట్రిక్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు గూండాలు తలుపులు బద్దలు కొట్టుకుని వస్తారు.
వాళ్ల వెనకే రజినీ తుపాకీ, కత్తితో ఊచకోత కోస్తూ రావడం చాలా వయొలెంట్ గా ఉంది. తర్వాత బయటికొచ్చాక మిలటరీ వార్ ట్యాంక్స్ తో వచ్చిన వందల కొద్దీ గూండాలు మెషీన్ గన్స్ గురి పెడితే అవన్నీ గాల్లో పేలిపోయి వాటి ముందు రజినీ స్టైలిష్ గా నడుచుకుంటూ రావడం రజినీ ఫ్యాన్స్ కు నెక్ట్స్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చింది. అనిరుధ్ బీజీఎం ఎప్పటిలానే టీజర్ స్థాయిని పెంచింది. కొడుకు, విలన్ పాత్రలు చనిపోయాయి కాబట్టి మిగిలిన వారు, మనవడు, కోడలు, భార్యతో పాటూ ఫ్యామిలీకి సంబంధించిన ఓ ట్విస్ట్ ను నెల్సన్ ఈ సినిమాలో జోడించాడంటున్నారు. ప్రస్తుతం కూలీ సినిమా చేస్తున్న రజినీ కాంత్ ఆ సినిమా పూర్తైన వెంటనే జైలర్2 ను మొదలుపెట్టనున్నాడు.













