తమిళ్ వెబ్ సిరీస్ లో జై – వాణి
తమిళ డబ్బింగ్ చిత్రం ‘జర్నీ’తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన హీరో జై. తెలుగమ్మాయి అంజలితో ఎఫైర్ కారణంగా మనకి మరింతగా వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ఆ తర్వాత రాజు…రాణి చిత్రంలో నటించి తన అమాయకత్వపు నటనతో మెప్పించాడు. ఈమధ్య ‘లవ్ జర్నీ’ అనే చిత్రం చేసి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తెలుగులోఅరుదుగా మాత్రమే కనిపించే జై తమిళంలో మాత్రం చాలా చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సాధించాడు. కానీ కొంతకాలంగా ఈయన సినీ రేస్‌లో వెనుకబడి పోయాడు. అడపాదడపా మాత్రమే వెండితెరపై దర్శనమిస్తున్నాడు. వరస ఫ్లాప్ వల్ల ఈయన కెరీర్ డౌన్ ఫాల్ లో పడింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈయన డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ పై కనిపించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సినిమాలు లేకపోవడంతో ఈయన వెబ్ సిరీస్ లలోకి అడుగు పెడుతున్నాడు. ప్రస్తుత లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ లకి సంబంధించిన కథలను వినడానికి కేటాయిస్తున్నాడు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ వద్ద దర్శకత్వ శాఖలో అసోసియేట్ గా పనిచేస్తోన్న తన స్నేహితుడైన ఓ డైరెక్టర్ తీసే వెబ్ సిరీస్ ద్వారా జై డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. ఈ వెబ్ సిరీస్ ని స్వయంగా కార్తీక్ సుబ్బరాజ్ నిర్మిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ని డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం చేయడానికి ఒప్పందం కుదిరిందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ లో యంగ్ హీరోయిన్ వాణి భోజన్ నటించనుంది. ‘ఓ మై కడవులే’ చిత్రం ద్వారా వాణిభోజన్ తమిళంలో సినీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా చేసిన ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ప్రస్తుతం జై, వాణి భోజన్ తో కలిసి వెబ్ సిరీస్ లో నటించనున్నారనే వార్త తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.













