జైసింహా ఫస్ట్ లుక్ విడుదల
బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ‘జైసింహా’అనే టైటిల్ ఫైనల్ చేశారు. ఇది బాలయ్యకు 102 వ సినిమా. నయనతార, నటాషా, హరిప్రియ కథానాయికలు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజాగా విడుదలయ్యింది. కోరమీసం, చేతిలో కర్ర, గాగుల్స్ ధరించి ఉన్న బాలయ్య లుక్ అభిమానులని ఆకర్షించే విధంగా ఉంది. ఫస్ట్ లుక్ లో బాలయ్య తనదైన స్టైల్లో అదరగొట్టారు. చేతిలో కర్రపట్టుకుని స్టయిలిష్ గా కనిపించారు. పోస్టర్లో ప్రజలు ధర్నా చేస్తున్న దృశ్యాన్ని చూపించారు. దీంతోపాటు అందులోని బాలయ్య తండ్రి, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.













