‘జై లవ కుశ’ టీజర్ రిలీజ్
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టైమ్ రానే వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవ కుశ’ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహస్తున్నఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు.
జై, లవ, కుశ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. గురువారం సాయంత్రం 5.22 గంటలకు జై పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. టీజర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జూనియర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ ప్రధాన పాత్రలలో బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’ టీజర్ ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ విడుదలై సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.













