Jagapathi Babu: ఒకప్పటి హీరోయిన్ లతో జగ్గూ భాయ్

టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా, లవర్ బాయ్ గా ఎంతోమంది ఆడవాళ్ల మనసుల్ని దోచుకున్న జగపతి బాబు(jagapathi babu) ఇప్పుడు విలన్ పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన క్రేజ్, ఇమేజ్ ను ఇంకా పెంచుకున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రీసెంట్ గా హోస్ట్ అవతారమెత్తారు జగ్గూ భాయ్. జీ తెలుగు(zee telugu) కోసం జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu nischayammu raa) అనే టాక్ ను సక్సెస్‌ఫుల్ గా రన్ చేస్తున్నారు జగపతి బాబు.
ఇప్పటికే ఈ షోకు పలువురు సెలబ్రిటీ గెస్టులు రాగా ఆ ఎపిసోడ్స్ సక్సెస్ అయ్యాయి. అయితే తాజాగా ఈ షో కు అలనాటి భామలను తీసుకొచ్చి సందడి చేశారు జగపతి బాబు. ఆయన హీరోగా ఉన్నప్పుడు నటించిన సినిమాల్లోని హీరోయిన్లను ఈ షో కు పిలవగా వారు వచ్చి సందడి చేశారు. రీసెంట్ గానే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైంది.
మీనా(Meena), మహేశ్వరి(Maheswari), సిమ్రన్(Simran) జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో కు రాగా, షూటింగ్ బ్రేక్ టైమ్ లో అందరూ కలిసి తమ హీరో జగపతి బాబుతో కలిసి ఓ ఫోటో దిగి, దాన్ని సోషల్ మీడియలో షేర్ చేశారు మీనా. అలనాటి హీరోహీరోయిన్లను ఒకే ఫ్రేములో చూసి నెటిజన్లు ఆ ఫోటోను నెట్టింట వైరల్ చేస్తూ ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు