రాజారెడ్డి ప్రాతలో జగపతిబాబు?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జీవితాధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అయితే ఇందులో వైఎస్ఆర్ తండ్రి వైఎస్ రాజారెడ్డి పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో రాజారెడ్డి పాత్రకు జగపతి సరిగ్గా సరిపోతారని భావించిన చిత్రబృందం ఆయన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. 1925లో పుట్టిన రాజారెడ్డి రాయలసీమ ప్రజల్లో ఎంతో గౌరవం ఉంది. 1998లో సంభవించిన బాంబు దాడిలో రాజారెడ్డి కన్నుమూశారు. ఈ విషయాలన్నీ సినిమాలో ప్రస్తావించనున్నారట. ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి వి.రాఘవ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.













