రాజకీయాల్లోకి ప్రముఖ యాంకర్ ?
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ రాజకీయ అరంగ్రేటం చేయడానికి ముహుర్తం ఖారారైనట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అనసూయకు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని, ఈ నేపథ్యంలో తన రాజకీయ అరంగ్రేటం కోసం ఏ పార్టీ అయితే మంచిది అని అనసూయ తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జబర్ద్స్త్ షో కు జడ్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెలే, నటి రోజా గైడెన్స్ తోనే అనసూయ రాజకీయాల వైపు చూస్తున్నారని ఆమె బాటలోనే త్వరలోనే అసూయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు మంచి మూహుర్తాలు లేవు కనుక వచ్చే మే నెలలో మంచి ముహూర్తాల్లో అనసూయ అధికారికంగా తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.













