‘ఇట్లు అంజలి’ ట్రైలర్ విడుదల
శ్రీకార్తికేయ, హిమాన్షీ, శుభాంగి పంత్ హీరోహీరోయిన్లుగా నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇట్లు అంజలి. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, దర్శకుడు మారుతి కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ట్రైలర్, పాటలు చాలా బావున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన శ్రీకార్తికేయ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. హీరో శ్రీకార్తికేయ మాట్లాడుతూ హీరోగా నా తొలి చిత్రమిది. దర్శకుడు నవీన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నవీన్, సంగీత దర్శకుడు కార్తిక్ కొడగండ్ల, హీరోయిన్లు హిమాన్షీ, శుభాంగి పంత్ తదితరులు పాల్గొన్నారు.













