శివ నిర్వాణ సినిమాలో ఐటెమ్ సాంగా..?
ఫీల్ గుడ్ లవ్ స్టోరీల దర్శకుడిగా దక్కించుకున్న శివ నిర్వాణ తాజాగా నాని తో టక్ జగదీష్ అనే మాస్ కం ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సినా కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఆగిపోయింది. చిన్న బ్రేక్ త్వరలోనే మీ ముందుకు వస్తామంటూ నాని ప్రకటించాడు. వాస్తవానికి టక్ జగదీష్ సినిమా చిత్రీకరణ పూర్తయి చాలా నెలలైంది.
ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక వార్త మీడియాలో పుకార్లు చేస్తున్నాయి. ఈ సినిమాలో కీలకమైన ఐటెమ్ సాంగ్ గురించి చర్చలు నడుస్తున్నాయి. టక్ జగదీష్ లో సీనియర్ హీరోయిన్ తో ఒక ఐటెమె సాంగ్ చేయించారట. ఆ ఐటెమ్ సాంగ్ సినిమాలో చాలా స్పెషల్ గా ఉంటుందంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యేవరకు ఈ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచాలనుకున్నారు కానీ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవడం వల్ల విషయం బయటకు లీక్ అయింది.
సినిమా షూటింగ్ విషయంలో కూడా ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డ యూనిట్ ఇప్పుడు మాత్రం దాన్ని బయటకు రాకుండా ఉంచలేకపోయారు. కానీ ఈ సీనియర్ హీరోయిన్ ఎవరన్నది మాత్రం తెలియాల్సి ఉంది. విభిన్నమైన ప్రేమ కథలను ఎంతో మెచ్యూర్డ్ గా తెరకెక్కించే శివ నిర్వాణ లాంటి డైరక్టర్ ఐటెమ్ సాంగ్, మాస్ సినిమా అంటూ కొత్త ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకుంటాడా అనే విమర్శలు కూడా వస్తున్నాడు. కానీ దర్శకుడన్నప్పుడు అన్ని విధాల ప్రయత్నించాలని మరికొందరు అంటున్నారు. మరి టక్ జగదీష్ తో శివ నిర్వాణ ఏం చేస్తాడు, ఎలాంటి ఫలితాన్నందుకుంటాడనేది చూడాలి













