నిర్మాతలు ఇకనైనా ఆలోచించి డీల్స్ చేస్తే బెటర్..
సమ్మర్ రిలీజ్ అయిన్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా అంటే 2018 అని చెప్పుకోవాలి. ఈ సినిమా కేవలం మూడు వారాల్లోపే 150 కోట్ల తో మోహన్ లాల్ ఆల్ టైమ్ రికార్డ్ లో టాప్ 2 లో ఉన్న సినిమాను చాలా ఈజీగా పెద్ద మార్జిన్ తో క్రాస్ చేసింది. బయ్యర్లు ఈ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని చాలా నమ్మకంతో ఉన్నారు.
కానీ బ్లాక్ బస్టర్ల విషయంలో ప్రొడ్యూసర్లు వాటి షూటింగ్ టైమ్ లోనే ఓటీటీ డీల్స్ కు టెంప్ట్ అయి సినిమా థియేట్రికల్ రెవిన్యూని దెబ్బతీస్తున్నారు. డబ్బింగ్ సినిమాల విషయంలో ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. 2018 సినిమాను జూన్ 7న సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమాలో తెలుగులో రిలీజ్ అయి ఇంకా వారం రోజులు కూడా కాలేదు.
ఈ లోపే ఓటీటీలో రిలీజ్ అంటున్నారు. ఓటీటీలో సినిమా వస్తుందని తెలిస్తే ఇక థియేటర్లకు వెళ్దామనుకున్న వాళ్లు కూడా ఆగిపోవచ్చు. ఒరిజినల్ వెర్షన్ ని సబ్ టైటిల్స్ తో చూడొచ్చు లే అనుకునే వారూ లేకపోలేదు. ఈ సినిమా నాలుగు రోజులకే 5 కోట్లు కలెక్షన్లను దాటి మేమ్ ఫేమస్ మూవీని డామినేట్ చేస్తోంది. అలాంటప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అనే న్యూస్ వినిపిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది.
ఎలాగూ ఇప్పుడు ఆ ఓటీటీ రిలీజ్ ను ఆపలేరు కానీ ఇకముందైనా నిర్మాతలు ఇలాంటి విషయాలని దృష్టిలో ఉంచుకుని డీలింగ్స్ జరుపుకుంటే అందరికీ మంచిది. సినిమా రిలీజైన 33 రోజులకే సినిమాలు ఓటీటీలోకి వస్తే ఇక బ్లాక్ బస్లర్ సినిమాలను కూడా జనాలు ఓటీటీలో చూడాలనే అనుకుంటారు. ఆదివారం వరకు హౌస్ ఫుల్స్ చేసుకున్న 2018, సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గుతాయనడంలో సందహం లేదు.













