పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి
ప్రముఖ సినీ నటి ఆసిన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమక ఏంజిల్ లాంటి ఆడబిడ్డ పుట్టినందుకు సంతోషపడుతున్నామని ఆసిన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. గత తొమ్మిది నెలలు మా ఇద్దరికీ ఎంతో ప్రత్యేకమని, ఆసిన్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. పండంటి పాపాయి వారి ఇంట అడుగుపెడుతున్న సందర్భంగా నా స్నేహితులు ఆసిన్, రాహుల్ శర్మకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు అని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్ తమ పాపను ఎత్తుకున్న ఫోటోను రాహుల్ శర్మ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. 2016 జనవరి 19న మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను ఆసిన్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే.













