‘ఇస్మార్ట్ శంకర్’ జూలై 18కి వాయిదా
రామ్, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబోలో రూపొందుతున్న ఐస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్ మార్చుకుంది. తొలుత జూలై 12 ఫిక్స్ చేశారు, కాని ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ జూలై 14న జరగనుంది. ఇండియా మ్యాచ్‌ల సమయంలో అయితే బయట జనసంచారం కూడా తగ్గుతుంది. ఇక ఎప్పుడు కళకళలాడే సినిమా థియేటర్స్ కూడా వెలవెలపోతున్నాయి. వరుస సినిమాలు థియేటర్స్‌లోకి వస్తున్నప్పటికి ప్రేక్షకుల సంఖ్య మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇండియా చూస్తేనేమో వరస విజయాలతో హాట్ ఫేవరేట్ గా మారిపోయి చివరి పోరు బరిలో ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా జనం మూడ్ ఆ ఫైనల్ మీదే ఉంటుంది. ఇవన్నీ ముందుగా ఊహించిన ఇస్మార్ట్ శంకర్ టీం తమ చిత్రాన్ని జూలై 18కి వాయిదా వేశారు.













