ఇస్మార్ట్ శంకర్… మరో రికార్డు

రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేష్‍లు కలిసి నటించిన సెన్సేషనల్ మూవీ ఇస్మార్ట్ శంకర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్‍బస్టర్‍గా నిలిచింది. హిందీ డబ్‍వెర్షన్‍లో కూడా అనేక రికార్డులు సెట్ చేసింది మూవీ. ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం తాజాగా 200 మిలియన్ వ్యూస్ సాధించి మరో భారీ రికార్డు నమోదుచేసుకుంది. దీంతో రామ్ అభిమానులు ఇండియన్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.