26న వస్తోన్న ఐశ్వర్యాభిమస్తు
తమన్నా, ఆర్య, విశాల్, సంతానం ముఖ్య తారాగణంగా నటించిన చిత్రం ఐశ్వర్యాభిమస్తు. ఎం.రాజేష్ దర్శకుడు. వరం జయంత్ కుమార్ నిర్మించిన చిత్రమిది. వినోదం ప్రధానంగా రూపొందిన ప్రేమకథా చిత్రం. సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ నెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ డి.ఇమాన్ సంగీతం అందించారు. పాటలను ఇటీవలే విడుదల చేశాం. సెన్సార్ సభ్యులు సైతం ప్రశంసించారు. క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు. ఆర్య హీరోగా నటిస్తూ, తమిళ్లో నిర్మించిన చిత్రమిది. అక్కడ మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. తమన్నా అందం, అభినయం ఆకట్టుకుంటాయి అని తెలిపారు.













