Janhvi Kapoor: జాన్వీ కెరీర్లో ప్రౌడ్ మూమెంట్ అదేనట!
చిత్ర పరిశ్రమలో ఎవరికెప్పుడు అదృష్టం కలిసి వస్తుందో తెలియదు. బాలీవుడ్లో వరుస ఫ్లాపుల తర్వాత జాన్వీ కపూర్(Janhvi Kapoor) పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఇషాన్ ఖట్టర్(Ishaan Khattar)తో కలిసి అందాల భామ జాన్వీ నటించిన హోమ్ బౌండ్(Home Bound) అనే మూవీ 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival)లో అన్ సెర్టైన్ రిగార్డ్ కేటగిరీలో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌కు చెందిన నీరజ్ గైవాన్(Neeraj Ghyvan) డైరెక్ట్ చేశారు.
నీరజ్ తెరకెక్కించిన తొలి చిత్రం మసాన్(Masaan) కూడా గతంలో ఇదే కేటగిరీలో కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించగా, ఇప్పుడు హౌమ్ బౌండ్ కూడా ఆ గౌరవాన్ని దక్కించుకోబోతుంది. మే 13 నుంచి 24 మధ్య హోమ్ బౌండ్ మూవీ ప్రపంచంలోని ఉత్తమ చిత్రాలతో పాటూ కేన్స్‌లో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా జాన్వీ తన ఇన్‌స్టా అకౌంట్లో మాట్లాడుతూ తన మొత్తం సినీ ప్రస్థానంలో ఇది గర్వించే సందర్భమని చెప్పింది.
నటిగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమాకు ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యక్తిగా తనకు చాలా ఆనందంగా ఉందని జాన్వీ తెలిపింది. భారతీయ సినిమా, వాటి భావోద్వేగాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) అన్నారు. ఇక, జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్(ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన(Buchibabu Sana) డైరెక్ట్ చేస్తున్న పెద్ది(Peddhi) సినిమాలో నటిస్తుండడం తెలిసిందే.













