Isha Koppikar: హీరోతో 15 సార్లు కొట్టించుకున్నా

టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున(Nagarjuna) హీరోగా నటించిన సినిమాల్లో చంద్రలేఖ(Chandralekha) కూడా ఒకటి. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్లుగా రమ్యకృష్ణ(ramyakrishna), ఇషా కొప్పికర్(Isha Koppikar) నటించారు. అయితే తాజాగా వారలో ఇషా కొప్పికర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చంద్రలేఖ చేస్తున్నప్పుడు నాగార్జునతో తాను ఏకంగా 15సార్లు చెంపదెబ్బలు కొట్టించుకున్నట్టు ఆమె చెప్పింది.
చంద్రలేఖ సినిమాలో కథ ప్రకారం నాగార్జున ఇషా కొప్పికర్ ను కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. కానీ చంద్రలేఖ ఇషా కొప్పికర్ కు అప్పటికి రెండో సినిమానే అవడంతో ఆ సీన్ లో తనకెలాంటి ఫీలింగ్ రావడం లేదని, అందుకే తనను నిజంగానే కొట్టమని తాను నాగార్జునను అడిగినట్టు ఇషా చెప్పింది. అది విని నాగ్ నిజంగానేనా అని అడిగారని, తాను నిజంగానే అని చెప్పానని ఇషా తెలిపింది.
అయితే మొదట్లో నాగార్జున సున్నితంగానే కొట్టారని, కానీ అది సరిపోక పోవడంతో నిజంగా 15సార్లు చెంపదెబ్బలు తినాల్సి వచ్చిందని చెప్పింది. ఆ సీన్ కు సంబంధించిన టేక్ పూర్తయ్యాక నాగ్ ఆమెకు సారీ కూడా చెప్పారని ఇషా తెలిపింది. అయితే ఏకంగా అన్ని దెబ్బలు తినడంతో తన బుగ్గపై మచ్చలు కూడా పడిపోయాయని ఆమె వెల్లడించింది.