Karthi: కార్తీ సినిమా వాయిదాకు కారణమదేనా?
తమిళ హీరో కార్తీ(karthi) తమిళ హీరోనే అయినప్పటికీ అతనికి తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది. సూర్య(suriya) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ చాలా తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తన సినిమాలతో ఆడియన్స్ ను అలరించడానికి, మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అలాంటి కార్తీ నటిస్తున్న ఓ సినిమా ఎన్నో రోజులుగా సెట్స్ పైనే ఉంది తప్పించి ఇంకా రిలీజవడం లేదు. ఎప్పుడో 2023లో మొదలైన వా వాతియార్(Vaa vaathiyar) మూవీ ఇంకా రిలీజవలేదు. నలన్ కుమారస్వామి(nalan kumaraswamy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తుండగా, సంతోష్ నారాయణన్(santhosh narayanan) సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
ఎప్పటికప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం, ఆ తర్వాత వాయిదా వేయడం చిత్ర యూనిట్ కు చాలా మామూలైపోయింది. అయితే వా వాతియార్ మూవీ ఇలా పలుమార్లు వాయిదా పడటానికి కారణం ఓటీటీ డీల్ అని తెలుస్తోంది. మేకర్స్ ఆశించిన రేట్ రాకపోవడంతోనే నిర్మాత జ్ఞానవేల్ రాజా(gnanavel raja) ఈ సినిమాను వాయిదా వేస్తున్నారని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.






