#NTR30 స్టోరీ లైన్ ఇదేనా… ?
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ ఎంతటి సక్సెస్ అందుకుందో తెలిసిన విషయమే. చాలా కాలం పాటు ఫ్యాన్స్ లో ఆ సినిమా గురించి, ఆ క్యారెక్టర్ గురించి చర్చలు జరిగాయంటే దాని ప్రభావం ఎంతగా ఉందో అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల తెరకెక్కించే సినిమా స్టోరీ ఎలా ఉంటుందో, ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఎగ్జయిట్మెంట్ నెలకొంది.
ఈ నేపథ్యంలోనే వీరి కాంబోలో సినిమా రాబోతుందని వెల్లడవగానే వెంటనే సినిమాపై ఆరాలు తీయడం మొదలెట్టారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడు? అనే దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పుకుంటున్నారు. హీరో అంటే ఎన్టీఆర్ ఒక చిన్న టౌన్ నుంచి పెద్ద నగరానికి వచ్చి సిట్యుయేషన్స్ వల్ల అసాధారణంగా మారతాడని, ఆ తర్వాత కథేంటో తెరపై చూస్తేనే కిక్ అని చెప్పుకుంటున్నారు.
చెప్పుకోవడానికి, వినడానికి స్టోరీ లైన్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది. కానీ కొరటాల ఇలాంటి సింపుల్ స్టోరీలను తీసుకుని, దానికి బరువైన భావోద్వేగాలను జోడించి అందరినీ ఉద్వేగానికి గురి చేయడంలో ఆయన దిట్ట. ఈ సినిమా కూడా అలానే ఉండనుందని, వాటితో పాటూ ప్రతీ సినిమాలానే ఈ సినిమాకు కూడా కొరటాల మార్క్ సందేశముండనుందని చెప్తున్నారు. మొత్తానికి వీరిద్దరి కాంబోలో సినిమా అనేసరికి ఇటు ఫ్యాన్స్, అటు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.













