రవితేజకు ఇదేం సెంటిమెంట్ అసలు..?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రమేష్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. గతంలో కూడడా రవితేజ ఎన్నో సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసిన సందర్భాలున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఖిలాడీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ రీజన్ తోనే తన తర్వాతి సినిమాల్లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా రవితేజ ప్లాన్ చేస్తున్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా రవితేజ హీరోగా శరత్ మండవ అనే కొత్త డైరక్టర్ తో ఒక సినిమా స్టార్ట్ అయింది. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవాల్సి ఉన్నా సరే, కరోనా కారణంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. రవితేజ, శరత్ కాంబోలో రానున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ ను సెలెక్ట్ చేశారు.
ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఈ సినిమాలో మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. యాభై యేళ్ల వయసు దాటిన రవితేజ ఇప్పుడు వరుసగా డ్యూయల్ హీరోయిన్స్ తో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ, త్రినాధ రావు నక్కిన కాంబోలో రానున్న సినిమా కూడా ఈ ఏడాదిలోనే పట్టాలెక్కే ఛాన్సుంది. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లుండే ఛాన్సుదేమో అని అందరూ అనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాపై కూడా క్లారిటీ రానుంది.













