Ram Pothineni: ఆ బ్యానర్ లో రాపో మూవీ?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni) గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్(ismart shankar) తర్వాత హిట్ మొఖం ఎరుగని రామ్ ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr polishetty) ఫేమ్ పి. మహేష్ బాబు(p mahesh babu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని రామ్ చాలా కసిగా ఉన్నాడు.
రామ్ కసికి తగ్గట్టే సినిమా నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. గ్లింప్స్ నుంచి టీజర్, సాంగ్స్, రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ వరకు ప్రతీదీ సినిమాపై అంచనాల్ని పెంచుతూనే ఉన్నాయి. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే(bhagyasri borse) హీరోయిన్ గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే ఆంధ్రా కింగ్ తాలూకా(andhra king thaluka) తర్వాత రామ్ ఎవరితో సినిమా చేయనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా తర్వాత రామ్ లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయని, వాటిలో దేవర(devara) సినిమాను నిర్మించిన యువ సుధ ఆర్ట్స్(yuva sudha arts) బ్యానర్ లో రామ్ ఓ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ ఎవరనేది తెలియదు కానీ యువ సుధ బ్యానర్ లో రామ్ సినిమా ఉంటుందని మాత్రం అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






