సినిమాలకి దూరంగా శ్రీలీల!!!
వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొన్న శ్రీలీల కెరీర్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ భామ కొన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొంది. తన మొదటి సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి అనే మూవీ చేయగా అదేమీ పెద్దగా హిట్ కాలేదు కానీ ఈ భామకి మాత్రం ఆ సినిమా వల్ల చాలానే ఆఫర్స్ వచ్చాయి.
తన అందచందాలతోనే కాకుండా తన డ్యాన్స్ తో కూడా ప్రేక్షకులని ఆకట్టుకొంటుంది. యువతరం హీరోయిన్ అయిన తను యువ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరితో జత కడుతుంది. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ తో గుంటూరు కారం, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, నితిన్ తో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ , ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలు తన చేతిలో ఉన్నాయి. ఆమె నుంచి ప్రతి నెలకి ఒక సినిమా రిలీజ్ అవుతుంది.
ఇదిలా ఉంటే తన కెరీర్ లో కొన్ని డేస్ మూవీస్ చేయకూడదు అని నిర్ణయించుకొందట ఈ భామ. అదేంటి ఇప్పుడిప్పుడే కెరీర్ కరెక్ట్ ట్రాక్ లో పోతున్నది అనుకొనే టైమ్ లో ఇలాంటి నిర్ణయం ఏంటా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అసలు బ్రేక్ ఎందుకంటే ఈ అమ్మడు డాక్టర్ కోసం ఎం.బి.బి.ఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు కోసం ఈ గ్యాప్ ని తీసుకొంటున్నదని తెలుస్తుంది. ఈ పరీక్షల కోసం శ్రీలీల రెండు నెలల గ్యాప్ తీసుకొంటుంది. తర్వాత ఈ భామ మూవీస్ కంటిన్యూ చేయనుంది.













