‘సలార్’లో శృతి హాసన్ ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తుందట!
‘కే.జీ.ఎఫ్’ సినిమాతో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో ప్రభాస్‌తో ‘సలార్’ చేయబోతున్న విషయం తెలిసిందే! వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పుడు ‘కే.జీ.ఎఫ్’ కి సీక్వెల్ ‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-2’ పనుల్లో అతను బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన కే.జీ.ఎఫ్ ఛాప్టర్-2 టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ అనే సినిమా చేయబోతున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను లాంచ్ చేశారు. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమా నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. సాధారణంగా ప్రశాంత్ నీల్ ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనే అపవాదం ఉంది. దీన్ని ‘సలార్’ సినిమాతో చెరిపేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట అతను. అందుకోసం శృతి హాసన్‌కి ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ జర్నలిస్ట్ పాత్రను రాసుకున్నాడట. అంతేకాక.. ఆమెతో ఈ సినిమాలో భారీగా యాక్షన్ సీన్లు చిత్రీకరించాలనే ప్లాన్‌లో ప్రశాంత్ ఉన్నట్లు సమాచారం. ఇక కే.జీ.ఎఫ్‌ను నిర్మించిన హంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై సలార్ కూడా రూపొందనుంది. రవి బాసుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో నటించే ఇతర తారాగణం గురించి ఇంకా తెలియాల్సి వుంది.













