మోక్షు సినిమాలో విలన్ అతనేనా?
నందమూరి బాలకృష్ణ(Balakrishna) కొడుకు మోక్షజ్ఞ(Mokshagna) డెబ్యూ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో జరగనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU) నుంచి రాబోతున్న ఈ సినిమా కోసం ఎలాంటి కథను తీసుకుంటున్నారనేది ఇంకా క్లారిటీ లేదు.
ఈ సినిమాలో హీరోయిన్గా రవీనా టండన్(Raveena Tandon) కూతురు రషా తదానీ(Rasha Tadani) ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తోంది. మోక్షజ్ఞ(Mokshagna) డెబ్యూ చేస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati)ని తీసుకోవాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రానా- ప్రశాంత్ వర్మ మధ్య డిస్కషన్స్ జరిగాయని, రానా ఇంకా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదంటున్నారు. రానా పేరు రావడంతో ఈ సినిమాపై ఉన్న బజ్ ఇంకాస్త పెరిగింది. రానా ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ రావడం పక్కా. నవంబర్ నెలాఖరుకి ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే ఛాన్సుంది.













