పుష్ప3 కుదిరే పనేనా?
బాహుబలి(Baahubali) సినిమా తర్వాత ఒక కథను రెండు భాగాలుగా చెప్పడం అందరికీ బాగా అలవాటైంది. అయితే సూపర్ హిట్ సినిమాలకు మూడో భాగం తీసే ఆలోచనలు కూడా చేస్తున్నారు. బాహుబలి3(Baahubali3) గురించి కూడా రీసెంట్ గా చర్చ జరిగింది. కేజీఎఫ్3(KGF3) తీసే ప్లాన్ లో ఆల్రెడీ ప్రశాంత్ నీల్(Prasanth Neel) ఉన్నాడు. ఇప్పుడు పుష్ప2(Pushpa2) రిలీజ్ కాకముందే పుష్ప3(Pushpa3) గురించి చర్చిస్తున్నారు.
పుష్ప2కు సీక్వెల్ గా పుష్ప3 తీసే ఆలోచనలో సుకుమార్(sukumar) ఉన్నాడని ఇప్పటికే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడా విషయంలో నిర్మాత రవిశంకర్(ravi shankar) తాజాగా క్లారిటీ ఇచ్చాడు. పుష్ప2లో పుష్ప3కి కావాల్సిన అదిరిపోయే లీడ్ ఉంటుందని, మూడో భాగం కూడా ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఆయన చెప్పాడు బానే ఉంది కానీ నిజంగా ఈ సినిమా తీసే ఛాన్స్ ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి పుష్ప2 అనుకున్న దానికంటే చాలా లేటయింది. రెండేళ్లలో పుష్ప సినిమా వేరే సినిమాలు చేయాలనుకున్న బన్నీ(Bunny) ఐదేళ్లకు పైగా ఈ సినిమాలోనే ఉండిపోయాడు. రెండో భాగం అనుకున్నా సరే మొత్తంగా మూడేళ్లలో రెండు సినిమాలూ అయిపోతాయని అనుకున్నాడు కానీ మరో రెండేళ్లు లేటయింది. దీంతో బన్నీ తన గతంలో ఏ సినిమాకీ ఇవ్వనన్ని కాల్షీట్స్ పుష్పకి ఇవ్వాల్సి వచ్చింది. వీటన్నింటితో బన్నీ విసిగిపోయాడని సమాచారం. అందుకే పుష్ప2 సక్సెస్ పై ఎంత నమ్మకమున్నప్పటికీ పుష్ప3 విషయంలో బన్నీ అంత సుముఖంగా లేడని తెలుస్తోంది. కాబట్టి పుష్ప3 ఉన్నప్పటికీ ఇప్పట్లో ఉండటం కష్టం.













