ఏమో పూజా విషయంలో ఆ వార్తలను నమ్మలేం
సినిమాలో తన పాత్ర ఎలాంటిదైనా పూజా హెగ్డే చేసే థైస్ షోకు ఆడియన్స్ అంతా ఫ్లాటైపోతారు. అమ్మడు తెలుగులో చేసిన మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా, బన్నీతో కలిసి చేసిన డీజే సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది పూజా. అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొంత కాలం పాటూ టాలీవుడ్ లో తన సత్తా చాటింది. ప్రభాస్ సరసన చేసిన రాధే శ్యామ్ తర్వాత పూజా కెరీర్ బాగా డల్ అయిపోయింది. ఆ సినిమా హిట్ అయుంటే ఛాన్సులొచ్చేవేమో కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. తమిళంలో విజయ్ తో చేసిన బీస్ట్ కూడా ఆడలేదు. దీంతో పూజాకి ఆఫర్లు రాలేదు. మహేష్ తో గుంటూరు కారంలో మొదటిగా పూజానే హీరోయిన్ గా అనుకున్నారు కానీ అప్పుడున్న సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సినిమాను వదులుకుంది.
ప్రస్తుతం పూజాకి తెలుగులో సినిమాలేమీ లేవు. నాగచైతన్య హీరోగా విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో రాబోయే సినిమాలో పూజాని ఫైనల్ చేశారని వార్తలొస్తున్నాయి కానీ నిజంగానే ఆ సినిమా ఆఫర్ వచ్చిందా లేదా అన్నింటిలానే ఇది కూడా రూమరేనా అని అందరూ అనుమానపడుతున్నారు. అందుకే చైతన్య సినిమా స్టార్ట్ అయ్యేవరకు హీరోయిన్ పూజా అని కన్ఫర్మ్ చేయడం కష్టమే. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ప్రస్తుతం సూర్య44లో హీరోయిన్ గా నటిస్తోంది.













