కిల్ రీమేక్ వర్కవుట్ అవుతుందా?
రీసెంట్ గా రిలీజై విమర్శకుల ప్రశంసలతో పాటూ మంచి కలెక్షన్స్ ను దక్కించుకున్న బాలీవుడ్ మూవీ కిల్ చిన్న సినిమాగా రిలీజైంది. ఇప్పుడు బడ్జెట్ కు తగ్గట్టే నిర్మాణ సంస్థకు ఆ సినిమా లాభాలు తీసుకొచ్చింది. రిలీజ్ కు ముందు ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేసింది లేదు. కానీ కిల్ మూవీ ఆడియన్స్ కు బాగా రీచ్ అయింది. ఒక రాత్రి పూట ట్రైన్ లో జరిగే సంఘటన ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ను ఆ జానర్ ను ఇష్టపడే మూవీ లవర్స్ తెగ చూసేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఇప్పుడు వేరే భాషల్లోకి రీమేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి సుధీర్ బాబు, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు ఈ సినిమాను రీమేక్ చేయాలని ట్రై చేస్తున్నారు.
ఒక మంచి సినిమాను రీమేక్ చేయాలని మన హీరోలు అనుకోవడంలో తప్పు లేదు కానీ ఆ రీమేక్ ఇక్కడ ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది కూడా చూసుకోవాలి. కిల్ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను టార్గెట్ చేసే సినిమా కాదు. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చివర వరకు చూడలేరు కూడా. బాలీవుడ్ లో కొత్త హీరో చేశాడు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు. అలాంటి సినిమాను తెలుగులో ఒక ఇమేజ్ ఉన్న హీరో చేస్తే దానికి ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాకపోవచ్చు. దానికి తోడు కిల్ ఈ నెల 23 నుంచే ఓటీటీలో వస్తుందంటున్నారు. అలాంటప్పుడు ఎంతోమంది ఓటీటీలో చూసేస్తారు. మళ్లీ థియేటర్లకు రావాలంటే కొత్తదనం ఉండాలి. కాబట్టి ఈ రీమేక్ రిస్క్ చేయడానికి ఎవరు ముందుకొస్తారో చూడాలి.













