‘మహానటి’ కీర్తి సురేష్ సినిమాల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేస్తోందా?
‘మహానటి’ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు కీర్తించేలా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అప్పటివరకు కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ `మహానటి` ఆమె కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది. మహానటి తర్వాత అరడజనుకుపైగా సినిమాల్లో హీరోయిన్గా నటించిన కీర్తి ఆశించిన విజయాలు అందుకోలేకపోయింది. విజయ్ హీరోగా నటించిన సర్కార్ చిత్రం మినహా మిగతా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడమే కాదు, నటిగా కూడా ఆమెకు మంచిపేరును తెచ్చిపెట్టలేదు. ముఖ్యంగా ఇటీవల ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఒకదానిని మించి మరొకటి అన్నట్టుగా డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలు చూసిన తర్వాత కథల ఎంపిక విషయంలో, సినిమాలోని తన క్యారెక్టర్ ప్రాధాన్యం విషయంలో అంతగా కేర్ తీసుకోవడం లేదనేది అర్థమవుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో మూడు తెలుగు సినిమాలు కాగా, రెండు తమిళ సినిమాలు, మలయాళంలో ఒకటి చేస్తోంది. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తయితే, ఈ ఆరు సినిమాలు ఒక ఎత్తుగా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న కీర్తి ఒక్కసారిగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్వైపు వెళ్ళకుండా ఉంటే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే కీర్తి సురేష్ కూడా ఇకపై లేడీ ఓరియంటెడ్ మూవీస్ చెయ్యకూడదని డిసైడ్ అయ్యిందట.
ప్రస్తుతం తెలుగులో రంగ్‌దే, గుడలక్ సఖి, సర్కారువారి పాట సినిమాలు చేస్తోంది కీర్తి. సంక్రాంతికి రంగ్‌దే సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తుండగా, డిసెంబర్ లేదా జనవరిలో మహేష్ హీరోగా నటించే సర్కారువారి పాట సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు. అలాగే రజనీకాంత్ లేటెస్ట్ మూవీ అన్నాత్తైలో కూడా కీర్తి ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా కీర్తి సురేష్ నటిస్తున్న ఓ తమిళ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ అయింది. అరుణ్ మహేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న `సాని కాయిధామ్` చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్దరూ కూర్చొని ఉన్న ఫోటోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌ను చూసిన ప్రతి ఒక్కరికీ దండుపాళ్యం సినిమా గుర్తు రాక మానదు. రగ్డ్గా కనిపిస్తున్న కీర్తి ఆ క్యారెక్టర్ చెయ్యడం వెనుక కారణం ఏమిటో… ఆమె కెరీర్‌కు ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.













