పుష్ప రావడం ఆలస్యమయ్యేనా..?
సుకుమార్ డైరక్షన్ లో బన్నీ, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్నసినిమా పుష్ప. ఇందులో మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరిు ముత్యం శెట్టి మీడియాలు పుష్ప ని నిర్మిస్తున్నాయి.
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్ట్ 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పుష్ప చెప్పిన టైమ్ కు రావడం కష్టమే అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తుంది. సినిమా బ్యాక్ డ్రాప్ కు తగ్గట్లు ఎక్కువ భాగం దట్టమైన అడవుల్లోనే షూట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే మారేడుమిల్లి అడవుల్లో రెండు షెడ్యూల్స్ ఫినిష్ చేశారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని టెన్ కాశీ ప్రాంతంలో ఈ సినిమా షూట్ జరుగుతుందని సమాచారం.
రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, దానికి తగ్గట్లుగా చిత్రీకరణ చేయాల్సి రావడం చిత్ర యూనిట్ పై ఒత్తిడి పెడుతుంది. సాధారణంగా సుకుమార్ తన సినిమాలను నెమ్మదిగా హడావిడి లేకుండా కావాల్సినంత టైమ్ తీసుకుని పూర్తి చేస్తుంటారు. కానీ ఇప్పుడు పుష్ప షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. దానికి తోడు రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం కూడా ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో పుష్ప చెప్పిన డేట్ కి రావడం కుదరకపోవచ్చంటున్నారు. మరి ఈ విషయమై యూనిట్ సభ్యులు క్లారిటీ ఇస్తే తప్ప ఏ విషయం తెలియదు.













