తమిళ డైరెక్టర్ని పెళ్లాడబోతున్న తెలుగమ్మాయి
టాలీవుడ్ హీరోయిన్, తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఓ తమిళ డైరెక్టర్‌తో ప్రేమలో పడిందని, వారిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అందంతో పాటూ అభినయం కలబోసిన ఈషాకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి అడుగుపెట్టి 3 రోజెస్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆఫర్లు అందుకుని, పక్క ఇండస్ట్రీల్లో లక్‌ని టెస్ట్ చేసుకుంటోంది ఈషా. ఈ క్రమంలోనే ఓ తమిళ డైరెక్టర్‌తో ప్రేమలో పడిందని, త్వరలోనే వారిద్దరూ కలిసి పెళ్లి పీటలెక్కబోతున్నారని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయని తెలుస్తోంది. ఏదేమైనా ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈషా నోరు విప్పే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే నెటిజన్లు మాత్రం ఈషా ప్రేమించిన ఆ తమిళ డైరెక్టర్ ఎవరా అని ఆరా తీస్తున్నారు.













