కపిల్ దేవ్ బయోపిక్ లో దీపిక?
లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితాధారంగా హిందీలో ఓ బయోపిక్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 83 అనే టైటిల్‌ను ఖరా చేశారు. అయితే ఈ చిత్రంలో కపిల్ భార్య రోమీ భాటియా పాత్రలో దీపిక పదుకొణె నటిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అదే నిజమైతే పెళ్లయ్యాక దీప్‌వీర్ జంట రీల్ లైఫ్ భార్యభర్తలుగా నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంలో సినిమాను తెరకెక్కించబోతున్నారు.













