ఇప్పట్లో ఐకాన్ మీద బన్నీ కన్నేస్తాడా..?
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పుష్ఫతో బన్నీ పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించేయడంతో మిగిలిన షూట్ ను కూడా త్వరగా పూర్తి చేసే పనిలో పడింది పుష్ప టీమ్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. సుకుమార్, బన్నీ కాంబోలో రానున్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదిలా ఉంటే, బన్నీ తర్వాత సినిమాల గురించి కూడా ఇప్పుడే చర్చలు జరుగుతున్నాయి. పుష్ప తర్వాత బన్నీ కొరటాల డైరక్షన్ లో సినిమా చేయనున్నాడు. దీని గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కొరటాల ఆచార్య తర్వాత ఈ సినిమానే చేయనున్నాడు. ఇది కాకుండా ఇప్పుడు మరో సినిమా గురించిన వార్తలు తెరమీదకొచ్చింది. ఇప్పటికే వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ కు ఐకాన్ అనే స్టోరీ వినిపించి ఓకే చేయించుకున్నాడు. తీరా సినిమా స్టార్ట్ అవుతుందిలే అనుకునే టైమ్ కి సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాతో తన స్టామినా చూపించడానికి రెడీ అవుతున్నాడు వేణు శ్రీరామ్. దీంతో ఇదే టైమ్ లో ఐకాన్ గురించి బన్నీతో డిస్కషన్ చేసేందుకు దిల్ రాజు రెడీ అవుతున్నాడట. మరి వీరి కాంబోలో సినిమా ఎప్పుడొస్తుందో, వకీల్ సాబ్ తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ తో చేస్తాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.













