ఇలాంటి టైమ్ లో బన్నీ ఆ రిస్క్ చేస్తాడా?
ఎలాగైనా స్కందతో రామ్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడనుకుంటే ఆ సినిమా అందరి అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా డైరెక్టర్ బోయపాటి మాత్రం ఎప్పటిలానే సినిమా రిలీజ్ కు ముందు కనిపించకుండా, రిలీజ్ తర్వాత ఇప్పుడు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిస్తున్నాడు.
స్కంద సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తన తర్వాతి సినిమాలు పాన్ ఇండియా హీరోలైన అల్లు అర్జున్, సూర్య తో ఉంటాయని చాలా క్లియర్ గా చెప్తున్నాడు బోయపాటి. అయితే తన ఇమేజ్ సినిమా సినిమాకు పెంచుకుంటూ పోతున్న బన్నీ ఈ మధ్య రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకే తన తర్వాతి సినిమాల గురించి చాలా కాలిక్యులేటెడ్ గా ఉంటున్నాడు.
ఇప్పటివరకు బన్నీ తన తర్వాతి సినిమాలుగా ఒప్పుకుంది త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలకు మాత్రమే. అన్నీ కుదిరితే అట్లీతో సినిమా చేసే ఛాన్సుంది. వీళ్లందరిని పక్కకు పెట్టి బన్నీ బోయపాటితో సినిమా చేసి ఈ టైమ్ లో రిస్క్ చేస్తాడా అని పలువురు డౌట్ పడుతున్నారు. బోయపాటితో ఒకప్పుడు బన్నీ సరైనోడు చేసి హిట్ కొట్టాడు కానీ అప్పడు బన్నీ రేంజ్ వేరు. ఇప్పుడు బన్నీ రేంజ్ వేరు. కానీ బోయపాటి మాత్రం అదే రెగ్యులర్ మూస మాస్ పద్దతిలోనే ఉన్నాడు. బాలయ్యతో మినహా మిగిలిన హీరోలతో మంచి ట్రాక్ రికార్డు లేని బోయపాటితో బన్నీ సినిమా చేస్తాడా లేదా అన్నది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.













