Iruvuru Bhamala Kougililo: ఘనంగా ప్రారంభమైన ‘‘ఇరువురు భామల కౌగిలిలో’’
దర్శకేంధ్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao)దర్శకత్వ పర్యవేక్షణలో అచ్యుత్ చౌదరి దర్శకత్వంలో దీపా ఆర్ట్స్ శ్రీనివాస గౌడ్ నిర్మాతగా ఎంతో అట్టహాసంగా అతిరథ మహారుధుల సమక్షంలో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన చిత్రం ‘ ఇరువురు భామల కౌగిలిలో’ . పూజా కార్యక్రమాల అనంతరం దర్శకులు కె.రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌ను నటీనటులు, దర్శక, నిర్మాతలకు అందచేశారు. ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ త్రినా«ద్ వర్మ (Trinadh Varma)హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా అక్షర గౌడ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖ నటులు నటించనున్నారు.
చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో హీరోయిన్లపై నిహారికా కొణిదెల క్లాప్‌నివ్వగా ప్రముఖ దర్శకులు బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్‌షాట్‌కి ప్రముఖ దర్శకులు ఎ కోదండరామిరెడ్డితో పాటు నిర్మాత, కెమెరామెన్ ఎస్ గోపాల్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్ర ఓపెనింగ్‌కి ‘కమిటీ కుర్రాళ్లు’ దర్శకుడు యధు వంశీతో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులందరూ పాల్గొన్నారు. టిల్లు స్వ్రే్కర్ దర్శకుడు మల్లిక్‌రామ్, దర్శకులు వర ముళ్లపూడి తదితరులు ఓపెనింగ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం– శీను భీట్స్, డిఓపి– శశాంక్ శ్రీరామ్, మాటల రచయిత– శ్రీధర్ సీపాన, ఎడిటర్– రాఘవేంధ్ర వర్మ, లైన్ ప్రొడ్యూసర్– సౌజన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్– సాయిరామ్ దేవర్ల, ప్రొడక్షన్ డిజైనర్– షర్మిలా కొప్పిశెట్టి, కాస్టూమ్స్– ప్రణతి, పి.ఆర్.ఓ– శివమల్లాల, నిర్మాత– శ్రీనివాస గౌడ, దర్శకత్వం– అచ్యుత్ చౌదరి.







