తగ్గేదేలే అనిపించిన పుష్ప ఇంట్రో
టాలీవుడ్ నుంచి మరో స్టార్ పాన్ ఇండియన్ హీరోగా మారే టైమొచ్చింది. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఫలితం దక్కిందన్నట్లుగా బన్నీ యాక్షన్ తో సుకుమార్ యాడ్ అయితే రిజల్ట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అనేదానికి శాంపిల్ గా ఒక ఇంట్రడక్షన్ ప్రోమోను వదిలింది పుష్ప టీమ్. ఇప్పటికే భారీ అంచనాలను పెంచిన పుష్ప., ఈ ప్రోమోతో అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది.
బన్నీ బర్త్ డే సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ పుష్పరాజ్ ఇంట్రో ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమోలో విజువల్స్ చూస్తే పుష్ప టీమ్ ఎక్కడా తగ్గేదే లే.. అనిపించేలా ఉంది. అంతేకాదు ఎర్రచందనం చెట్లు నరుకుతూ బన్నీని ఇంట్రడ్యూస్ చేసిన విధానం కూడా చాలా సర్ ప్రైజింగ్ గా ఉంది. అడవిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠా మేస్త్రీగా బన్నీని ఎక్కడా తగ్గేదేలే అనేట్లు చూపించేశారు. డ్రెస్సింగ్, యాక్షన్ అన్నీ నెవర్ బిఫోర్ అనే విధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని లుక్ లో పుష్పరాజ్ గా బన్నీ ని చూసిన ఫ్యాన్స్ కు టీజర్ చూశాక బన్నీ బర్త్ డే కు పంచభక్ష్య పరమాణ్ణం పెట్టినట్లు అనిపిస్తుంది.
సినిమాలో యాక్షన్ సీన్స్ ఫైట్స్ మాత్రం ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ తో ఈలలు వేయించేలా ఉంటాయని ప్రోమో చూస్తుంటే తెలుస్తుంది. పుష్పరాజ్ గా తలకు ముసుగు వేసుకుని బన్నీ చేస్తున్న ఫైట్స్ ఆడియన్స్ కు ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దానికి తోడు రాక్ స్టార్ మ్యూజిక్ కూడా గూస్ బంప్స్ తెప్పించడం ఖాయంగా అనిపిస్తుంది.













