నెగెటివ్ అయినా చేస్తా
హరిహర చలన చిత్ర బ్యానర్‌పై నందు, సౌమ్య, వేణు గోపాల్, పూజా రామచంద్రన్, గగన్ విహారి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో. ఈ చిత్రం ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో పూజా రామచంద్రన్ మాట్లాడుతూ ఈ సినిమాలో నేను తార అనే క్యారెక్టర్ చేశాను. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర నాది. హాట్‌గా, ఎమోషనల్‌గా ఉండే క్యారెక్టర్లో నటించాను. సినిమా కథ విషయానికి వస్తే, హీరో, హీరోయిన్ పెళ్లికి 36 గంటల ముందు ఏం జరిగిందనేదే ఈ కథ. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ వ్దద పనిచేసిన అనుభవం ఉన్న వరప్రసాద్ మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. ఆయన నటీనటుల నుండి కావాల్సిన పర్ఫార్మెన్‌ను రాబట్టుకున్నారు. హీరోయిన్గా మారిన తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నాను. సీరియస్ రోల్స్‌ను బాగా ఇష్టపడతాను. తెలుగులో డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఫర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలో నటించడానికి ఇష్ట పడతాను. నెగటివ్ క్యారెక్టర్ అయినా సరే చేస్తా. అలాగే యాక్షన్ మూవీస్‌లో నటించాలనే డ్రీమ్ ఉంది అని అన్నారు.













