స్పిరిట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. యానిమల్ మూవీ సెట్స్ లో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే రీసెంట్ గా సందీప్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అతను తర్వాతి సినిమాను ప్రభాస్ తో చేస్తాడా లేదా మళ్లీ బాలీవుడ్ హీరోతోనే చేస్తాడా అన్న డౌట్స్ వస్తున్నాయి.
అవన్నీ పక్కన పెడితే ప్రభాస్ తో చేయనున్న స్పిరిట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటివరకు స్పిరిట్ స్టోరీ ఫైనల్ వెర్షన్ ను ప్రభాస్ వినలేదని తెలుస్తోంది. ఫైనల్ వెర్షన్ విన్నాకే ఈ సినిమా గురించి పూర్తి డీటెయిల్స్ బయటకు రానున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే ను రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది.
స్క్రీన్ ప్లే మొత్తం రెడీ అయిన తర్వాత సందీప్, ప్రభాస్ ను కలిసి ఫైనల్ నెరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కథ ఎలాగూ ఇప్పటికే లాక్ అయింది కాబట్టి ప్రభాస్ రిజెక్ట్ చేసే ఛాన్సులు తక్కువ. పైగా సందీప్ కూడా వరుస విజయాలతో ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఆగిపోతుందనే ఛాన్స్ లేదు. టి-సిరీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉండనుందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2024 సెప్టెంబర్ తర్వాత స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.













