హాయ్ నాన్న గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్
నేచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం నాని ఈ సినిమా ప్రమోషన్స్ పైనే తన దృష్టంతటా పెట్టాడు.
హాయ్ నాన్న డైరెక్టర్ కు ఇదే ఫస్ట్ సినిమా కావడంతో నాని, సినిమాను తన భుజాలపై వేసుకుని మరీ ప్రమోట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు నెట్టింట వినిపిస్తున్నాయి. హాయ్ నాన్న సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు ఉంటుందట. ఇందులో సాంగ్స్ అన్నీ కలిపి 12 వరకు ఉంటాయని తెలుస్తోంది.
హాయ్ నాన్న లో బిట్ సాంగ్స్, థీమ్ సాంగ్స్ అన్నీ కలిపి 12 వరకు ఉంటాయట. సాంగ్స్ అన్నీ కథలో భాగంగానే ఉంటాయి తప్పించి ఎక్కడా స్కోప్ లేకుండా కావాలని ఇరికించినట్లు ఉండవని చెప్తున్నారు. ఈ మధ్య సినిమాల్లో పాటలు తక్కువగా ఉంటున్న నేపథ్యంలో హాయ్ నాన్నలో ఇన్ని సాంగ్స్ ఉండటం విశేషమనే చెప్పాలి. మరి హాయ్ నాన్న ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.













