మంగళవారం క్లైమాక్స్ ఆడియన్స్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందట!
ఈ వారం రిలీజవుతున్న సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా అంటే మంగళవారం మూవీనే. స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా ఈ సినిమా మీద మంచి బజ్ నెలకొంది. దానికి తోడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్ గా రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మంగళవారం బిజినెస్లో చాలా మార్పులొచ్చాయి.
దాదాపు రూ.13 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం. మంగళవారం లాంటి రేంజ్ మూవీకి ఇది చాలా పెద్ద బిజినెస్ అనే చెప్పాలి. దానికి తోడు రీసెంట్ గా ఈ జానర్ లో వచ్చిన పొలిమేర2 మంచి హిట్ అవడం కూడా ఈ సినిమా బయ్యర్లకు మంచి బూస్టప్ ను ఇచ్చింది. అయితే ఈ సినిమా మొత్తం ట్విస్టుల మీదే ఆధారపడి నడుస్తుందట.
మంగళవారం మూవీలో పాయల్ చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ హీరోయిన్ చేయని పాత్ర అని, సినిమా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు పాయల్ క్యారెక్టర్ మీద సానుభూతితో వస్తారని, క్లైమాక్స్ 45 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయని చెప్తున్నారు. అంతేకాదు, మెయిన్ లీడ్ అయిన పాయల్ సినిమాలో ఎంట్రీ ఇచ్చేది ఇంటర్వెల్ కు ముందేనట. అంటే గంట సేపు సినిమాలో పాయల్ కనిపించదు. మొత్తానికి డైరెక్టర్ అజయ్ భూపతి, మంగళవారం మూవీతో బాగానే ట్విస్టులు ఇవ్వనున్నాడని అర్థమవుతుంది.













