నాని సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చిన నాని తన సొంత కష్టంతో నేచురల్ స్టార్ అయ్యాడు. అందుకే కొత్త వాళ్లను ప్రోత్సహించడంలో నాని ఎప్పుడూ ముందుంటాడు. తనతో పాటూ మరింత మందికి లైఫ్ ఇవ్వాలని చూసే నాని, ఇప్పటికే చాలా మందిని డైరెక్టర్లుగా పరిచయం చేశాడు. నాని ఏ స్థాయిలో ఉన్నప్పటికీ టాలెంట్ ఉంటే వారికి నాని నుంచి తప్పక ప్రోత్సాహం లభిస్తుంది.
ఈ నేపథ్యంలోనే బలగం డైరెక్టర్ వేణుతో నాని సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు. డైరెక్టర్ వేణు అయినప్పటికీ ఈ సినిమాలో నాని, దిల్ రాజు భాగమవడంతో ఒక్కసారిగా సినిమా రేంజ్ పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా టైటిల్ వివరాలు లీక్ అవుతున్నాయి. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కథను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ వేణు సినిమాకు ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు అర్థమవుతుంది. ఈ సినిమా కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందనున్నట్లు అర్థమవుతుంది. వేణు విజన్ కు పెద్ద పీట వేస్తూ, తనకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చారట నాని, దిల్ రాజు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా దిల్ రాజు పరిమితులు పెట్టడం లేదని టాక్ వినిపిస్తోంది.













