క్రేజీ కాంబినేషన్ సెట్ చేసిన కమ్ముల..?
లవ్ స్టోరీల స్పెషలిస్ట్ గా శేఖర్ కమ్ముల కు చాలా మంచి పేరుంది. తన ప్రేమకథలన్నీ చాలా సున్నితంగా ఉండటంతో పాటూ అందరూ కన్విన్స్ అయ్యేలా ఉంటాయి. ఆయన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కేవలం పాటలకు మాత్రమే పరిమితమవదు, తనకంటూ ఒక మంచి వ్యక్తిత్వం ఉంటుంది. ఆమె అలవాట్లకు, అభిప్రాయాలకు, ఆలోచనలకు చాలా ప్రాధాన్యతనిచ్చేలా శేఖర్ కమ్ముల హీరోయిన్ క్యారెక్టర్ ను క్రియేట్ చేస్తాడు.
లవ్ స్టోరీలను ఆయన సెలెక్ట్ చేసుకునే తీరు, దాన్ని అందంగా నడిపించే విధానం, కథకు తగ్గ పాటలతో సినిమాను నడిపించే విధానం అందరికీ బాగా నచ్చుతుంది. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే యూత్ తో పాటూ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఆయన నుంచి లవ్ స్టోరీ రానుంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, పాటలతో ఈ సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇక అసలు విషయానికొస్తే, లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల మరో లవ్ స్టోరీ కోసం స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటున్నాడట. ఇందులో హీరోగా ఉప్పెన తో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ ను, హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ తో అందరి మనసుల్నీ దోచుకున్న ప్రియాంక అరుళ్ మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వైష్ణవ్, ప్రియాంక లిద్దరూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా కమిట్ మెంట్స్ పెట్టుకున్నారు కూడా. అవన్నీ పూర్తయ్యాకే వీరి కాంబోలో సినిమా ఉంటుందనే వార్త ప్రస్తుతం అక్కడక్కడా వినిపిస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంతుంది తెలియాలంటే ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.













