సైంధవ్ బ్యాక్‌డ్రాప్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్
వెంకటేష్ హీరోగా, హిట్ కేస్1, హిట్ కేస్2 డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సైంధవ్. సినిమాలో చాలా కీలక భాగం రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కుతోంది.
నవాజుద్దీన్ సిద్దుకీ విలన్‌గా చేస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ సగభాగం పూర్తి చేయగా, బ్యాలెన్స్ షూటింగ్‌ని జులై నుంచి మొదలు పెట్టబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్లు ఉండబోతున్నాయని ఇన్సైడ్ టాక్. ఈ సినిమా తెరకెక్కబోతున్న నేపథ్యానికి సంబంధించిన విషయాలు ఫ్యాన్స్‌లో హైప్ పెంచుతున్నాయి.
వాటిలో మరీ ముఖ్యంగా వినిపిస్తుంది మాత్రం బ్లాక్ మేజిక్ గురించి. ఓ అరుదైన మెడికల్ డ్రగ్ కాన్సెప్ట్‌తో పాటూ కర్ణాటక, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ వ్యావహారికంలో ఉన్న చేతబడులతో కథకు చాలా కీలకంగా ముడిపెట్టారట. వీటితో పాటు శాస్త్రీయంగా అది చాలా తప్పు అని గట్టిగా చెప్పనున్నాడట. అంతేకాదు సైంధవ్‌తో తన టాలెంట్ ఏంటో చూపించనున్నాడట శైలేష్.
సైంధవ్ సినిమాలో థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ చాలా ఎక్కువగా ఉండబోతున్నాయట. రీసెంట్గా ఆ జానర్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. మరి సైంధవ్ కూడా ఆ మేజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి. వెంకటేష్ ఇలాంటి యాక్షన్ ఫిల్మ్స్ చేసి చాలా సంవత్సరాలవుతోంది. ఈ యాక్షన్ సినిమా వెంకీకి ఏ మేరకు హిట్ ఇస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.













