స్పిరిట్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్
సలార్, కల్కి సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్, సలార్2, ఫౌజి, కల్కి2 సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వీటితో పాటూ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేయడానికి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే స్పిరిట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది.
ఈ ఏడాది ఆఖరికి స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తానని సందీప్ ఇప్పటికే అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉంటాడు? ఎలాంటి నేపథ్యంలో ఈ కథ ఉండనుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ సినిమా గురించి మరో రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట ప్రచారం అవుతున్నాయి. అందులో ఒకటి ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో చూడబోతున్నామట.
అందులో ఓ పాత్ర మరీ వైల్డ్ ఎలిమెంట్స్ తో కూడి ఉంటుందని, మరో పాత్ర సాఫ్ట్ గా ఉంటుందని అంటున్నారు. ఇక రెండో విషయం స్పిరిట్ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, కథలో ప్రభాస్ పాత్ర గతంలో ఎప్పుడూ చూడనటువంటి మాఫియా డాన్ గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు స్పిరిట్ లో డార్లింగ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసే వైల్డ్ యాక్షన్ సీన్స్ తో పాటూ రొమాంటిక్ సీన్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది.













