దేవర గురించి ఇంట్రెస్టింగ్ లీక్
ఆర్ఆర్ఆర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమా మీద ఎన్ని అంచనాలున్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన ఫియర్ సాంగ్ కు మొదట్లో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తర్వాత్తర్వాత ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది. ఈ సినిమాకు సంబంధించ చిత్ర యూనిట్ ఎలాంటి లీక్స్ జరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఏదొక రూపంలో లీకులు బయటికొస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు దేవర గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సముద్రపు ఒడ్డున ఉండే పది ఊళ్లను కాపు కాసే ఎంతో శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడట. అక్కడ దొరికే విలువైన సంపద కోసం ముష్కరులు కుట్ర వేసి 10 వేల మందితో దాడి చేస్తే వాళ్లను ఊచకోత కోస్తూ దేవర చూపించే విశ్వరూపం నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని చెప్తున్నారు.
టీజర్, ఫియర్ సాంగ్ లో చూపించే యాక్షన్ సీన్స్ అందులో భాగంగానే వస్తుందట. సముద్రమంతా నెత్తురుతో నిండిపోయి ఇప్పటివరకు వెండితెర మీద చూడని రక్తపాతాన్ని కొరటాల ఈ సినిమాలో చూపించనున్నాడని టాక్. ఇదంతా వినడానికే ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదూ. ఇక తెరమీద ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.













