ఓజీ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఓజీ షూటింగ్ మే లేదా జూన్ నెల నుంచి మళ్లీ మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఓజీని ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పుష్ప2 అదే తేదీకి కొన్ని నెలల ముందే రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. కానీ ఈ మధ్య పుష్ప2 రిలీజ్ డేట్ పై వస్తున్న పుకార్ల వల్ ఓజీని ఆ డేట్ కు దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే పుష్ప2 రిలీజ్ డేట్ విషయంలో వస్తున్న వార్తలన్నీ రూమర్లేనని, ఎట్టి పరిస్థితుల్లో పుష్ప2 సినిమాను చెప్పినట్లుగా ఆగస్ట్ 15కే రిలీజ్ చేస్తామని నొక్కి మరీ చెప్తున్నారు. అయితే పుష్ప2 తో పాటూ ఇప్పుడు ఓజీ కూడా రేసులోకి వచ్చిందని తెలుస్తోంది. ఇద్దరూ మెగా హీరోలే కావడం, డైరెక్టర్లిద్దరికీ పాన్ ఇండియా స్థాయి ఉండటం వల్ల ఒకే రోజు ఈ రెండు సినిమాలు రిలీజవడమనేది జరగని పని. కుదిరితే ఓ వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలొచ్చే అవకాశముంది.













